మరి కాస్త పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

  • వారం రోజుల వ్యవధిలో దాదాపు 75 పైసలు పెంపు
  • జైపూర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.43, డీజిల్‌ రూ.84.46
  • హైదరాబాద్‌లో లీట‌రు పెట్రోల్ 26, డీజిల్ 27 పైస‌లు పెంపు
  • పెట్రోలు లీట‌రుకు రూ.88.37, డీజిల్  రూ.81.99
దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మళ్లీ పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే పెట్రోలు, డీజిల్ ధరలు దాదాపు 75 పైసలు పెరగడం గ‌మ‌నార్హం. ఈ రోజు లీట‌రుకి 25 పైస‌ల చొప్పున చమురు కంపెనీలు ధ‌రలు పెంచాయి. దీంతో జైపూర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.43, డీజిల్‌ ధర రూ.84.46కు చేరింది. దేశంలో అత్య‌ధిక ధ‌ర‌లు ఇవే.

హైదరాబాద్‌లో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.88.37కు, డీజిల్ ధ‌ర రూ.81.99కి చేరింది.  ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.95, డీజిల్‌ ధర రూ.75.13గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.86.39, డీజిల్‌ రూ.78.72, ముంబైలో పెట్రోల్‌ రూ.91.56, డీజిల్‌ రూ.81.87చేరాయి.

ఇక చెన్నైలో పెట్రోల్‌ రూ.87.64, డీజిల్‌ రూ.80.44, బెంగళూరులో పెట్రోల్‌ రూ.87.82, డీజిల్‌ రూ.79.67, భువనేశ్వర్‌లో పెట్రోల్‌ రూ.85.66, డీజిల్‌ రూ.81.90, పాట్నాలో పెట్రోల్‌ రూ.87.56, డీజిల్‌ రూ.80.36గా ఉంది.


More Telugu News