మోదీ, ఆదిత్య‌నాథ్‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టు చేసినందుకు ఎల్ఎల్బీ విద్యార్థి స‌స్పెన్షన్.. అరెస్టు

  • గోరఖ్‌పూర్ వ‌ర్సిటీలో ఘ‌ట‌న‌
  • ఇక‌పై వర్సిటీలో అడుగు పెట్టకూడ‌ద‌ని ఆదేశం
  • దర్యాప్తునకు ఒక కమిటీని కూడా ఏర్పాటు
ప్రధాని మోదీతో పాటు ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సామాజిక మాధ్య‌మాల్లో అభ్యంతరకర రీతిలో పోస్టు చేశాడు ఓ ఎల్ఎల్బీ విద్యార్థి. దీంతో అతనిపై అధికారులు క‌ఠిన చ‌ర్యలు తీసుకున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేసిన నేప‌థ్యంలో గోరఖ్‌పూర్ వ‌ర్సిటీలో ఎల్ఎల్బీ ప్ర‌థ‌మ‌ సంవత్సరం చదువుతోన్న అరుణ్ కుమార్ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేయ‌డ‌మే కాకుండా గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ చేశారు.

అరుణ్ కుమార్ ఇక‌పై వర్సిటీలో అడుగు పెట్టకూడ‌ద‌ని చెప్పారు. ఆయ‌న తీరుపై దర్యాప్తునకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. మోదీ, యోగి ఆదిథ్య‌నాథ్‌ ఢిల్లీలో కలిసిన నేప‌థ్యంలో ఓ ఫొటో బ‌‌య‌టకు వ‌చ్చింది. దీన్ని ఉద్దేశిస్తూ ఆ విద్యార్థి అభ్యంత‌ర‌క‌ర రీతిలో వీడియోను రూపొందించి పోస్ట్ చేశాడు.  ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌పై అధికారులు క‌ఠిన చ‌ర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణ లేని కార‌ణంగా వ‌ర్సిటీ నుంచి తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.


More Telugu News