నాలుగు దశాబ్దాల తరువాత... అత్యంత కనిష్ఠానికి చైనా జీడీపీ వృద్ధి!

  • ప్రభావం చూపించిన కరోనా మహమ్మారి
  • 1970 తరువాత దారుణంగా పతనం
  • పలు దేశాల్లో చైనాకు వ్యతిరేక పవనాలు
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాను కరోనా మహమ్మారి దారుణంగా దెబ్బతీసింది. గడచిన సంవత్సరం చైనా స్థూల జాతీయోత్పత్తి రేటు 2.3 శాతంగా నమోదైంది. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత చైనాలో ఇంత తక్కువ జీడీపీ వృద్ధి నమోదవడం ఇదే తొలిసారి.
1970వ దశకం ప్రారంభంలో దేశంలో సంస్కరణలను అమలు చేసిన వేళ కనిష్ఠ వృద్ధి రేటును కళ్లజూసిన చైనా, ఆపై దూసుకుని వెళ్లింది. వృద్ధి రేటు పతనానికి కరోనా చూపిన ప్రభావమే కారణమని, స్వదేశంలోనూ, విదేశాల్లోనూ చైనాకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ హెచ్చరించింది.


More Telugu News