'రాధేశ్యామ్' యూనిట్ సభ్యులకు ఖరీదైన వాచీలు కానుకగా ఇచ్చిన ప్రభాస్!

  • 'రాధేశ్యామ్' చిత్రంలో నటిస్తున్న ప్రభాస్
  • సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్ కు సర్ ప్రైజ్
  • వాచీలు అందుకున్న యూనిట్ సభ్యులు
  • ఈ వేసవిలో రానున్న 'రాధేశ్యామ్'
బాహుబలి చిత్రాల నుంచి తన రేంజ్ ఆలిండియా లెవల్ కు విస్తరించిన టాలీవుడు హీరో ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. అయితే, సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ 'రాధేశ్యామ్' యూనిట్ సభ్యులను సర్ ప్రైజ్ చేశాడు. యూనిట్ మొత్తానికి ఖరీదైన టైటాన్ వాచీలను కానుకగా ఇచ్చాడు. ప్రభాస్ నుంచి ట్రెండీ రిస్ట్ వాచీలను అందుకున్న 'రాధేశ్యామ్' యూనిట్ సభ్యుల్లో హర్షం వ్యక్తమవుతోంది!

పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం రానున్న వేసవిలో విడుదల కానుంది.


More Telugu News