నాలుగేళ్ల బుడతడి క్రికెట్ టాలెంట్ కు కేటీఆర్ ఫిదా... ఏమంటావు లక్ష్మణ్? అంటూ ట్వీట్
- నెట్టింట వైరల్ అవుతున్న చిన్నారి క్రికెట్ వీడియో
- కచ్చితమైన టెక్నిక్ తో షాట్లు కొడుతున్న చిన్నారి
- అచ్చెరువొందిన కేటీఆర్
- ప్రత్యేక నైపుణ్యం అంటూ లక్ష్మణ్ స్పందన
సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడో బుడతడి క్రికెట్ వీడియో వైరల్ అవుతోంది. డైపర్లు తొడుక్కునే వయసులోనే బ్యాట్ పట్టి అలవోకగా కవర్ డ్రైవ్ లు ఆడుతూ, ఇప్పుడు నాలుగేళ్ల వయసులో మరింత టాలెంట్ చూపుతున్న ఓ చిన్నారిని ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను ఎస్కే షాహిద్ అనే నెటిజన్ పంచుకున్నాడు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేయగా, ఆయన ఈ వీడియో చూసి అచ్చెరువొందారు. అమోఘమైన ప్రతిభ అంటూ కితాబునిచ్చారు. అంతేకాదు, ఈ వీడియో పట్ల ఏమంటారు వీవీఎస్ లక్ష్మణ్, హర్షాభోగ్లే? అంటూ వారిద్దరినీ ట్యాగ్ చేశారు.
దీనిపై లక్ష్మణ్ వెంటనే స్పందించారు. నిజంగానే ఆ చిన్నారిలో అద్భుత నైపుణ్యం ఉందని తాను అంగీకరిస్తానని ట్వీట్ చేశారు. ఇంత చిన్న వయసులోనే కచ్చితమైన టెక్నిక్ తో ఆడుతున్న ఆ చిన్నారిలో ప్రత్యేక ప్రతిభ ఉందని పేర్కొన్నారు.