కొవాగ్జిన్ తో పెరిగిన గుండె వేగం.. ఎయిమ్స్ ఉద్యోగికి స్వల్ప దుష్ప్రభావం
- సెక్యూరిటీ గార్డులో కనిపించాయన్న ఎయిమ్స్ డైరెక్టర్
- చర్మంపై దద్దుర్లు.. అబ్జర్వేషన్ లో పెట్టిన డాక్టర్లు
- ప్రస్తుతం నిలకడగా అతడి ఆరోగ్యం
కొవాగ్జిన్ టీకా తీసుకున్న ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సెక్యూరిటీ గార్డుకు స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా తెలిపారు. 20 ఏళ్ల సెక్యూరిటీ గార్డుకు శనివారం సాయంత్రం 4 గంటలకు టీకా వేశారని, పావుగంటలోనే అతడి చర్మంపై దద్దుర్లు వచ్చాయని చెప్పారు. గుండె కొట్టుకునే వేగం పెరిగిందన్నారు. వెంటనే అతడిని అబ్జర్వేషన్ లో పెట్టి చికిత్స అందించామన్నారు.
తర్వాత కొద్దిసేపటికి అతడు కోలుకున్నాడని రణ్ దీప్ గులేరియా వివరించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ప్రస్తుతం అతడిని అబ్జర్వేషన్ లోనే ఉంచామని వెల్లడించారు. కాగా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్లను అబ్జర్వేషన్ లో పెట్టామని, తర్వాత వాళ్ల పరిస్థితి మెరుగు పడిందని ఉన్నతాధికారులు చెప్పారు. ఒకే ఒక్కరికి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయన్నారు.