కొమురం భీం జిల్లాలో రక్తం రుచి మరిగిన పులి... కొనసాగుతున్న వేట
- ఇద్దరు గిరిజనులను బలి తీసుకున్న పులి
- కేవలం రాత్రివేళల్లోనే సంచారం
- పగలు విశ్రాంతి తీసుకుంటున్న వైనం
- కంది భీమన్న అటవీప్రాంతంలో 150 మంది మోహరింపు
- తెలివిగా తప్పించుకుంటున్న పెద్దపులి
కొమురం భీం జిల్లా కంది భీమన్న అటవీప్రాంతంలో రక్తం రుచి మరిగిన పెద్దపులిని పట్టుకునేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరు గిరిజనులను చంపేసిన ఈ పెద్దపులి పగటి వేళల్లో దాక్కుంటూ రాత్రివేళల్లో యధేచ్ఛగా సంచరిస్తోంది. ఈ పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు పలు ప్రాంతాల్లో ఎరలు ఏర్పాటు చేసినా, ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ఆ ఎరలకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది.
మొత్తం 150 మంది ఈ పులి వేటలో నిమగ్నమయ్యారంటే దీని ప్రభావం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టైగర్ ట్రాకర్లు, రెస్క్యూ బృందాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు, వైద్య బృందాలతో కంది భీమన్న అటవీప్రాంతం సందడిగా మారింది. మనుషుల కదలికలు ఎక్కువగా ఉండడంతో పులి పగటివేళల్లో బయటికి రావడంలేదు.
అయితే రాత్రివేళల్లో జంతువులపై మత్తు మందు ప్రయోగించడానికి నిబంధనలు అంగీకరించవు. మత్తుమందు ప్రయోగించినా రాత్రివేళ పులిని బంధించడం చాలా ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం కావడంతో అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఇక్కడి అటవీప్రాంతంలో ఎత్తయిన మంచెలు ఏర్పాటు చేసుకుని పులి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.