మహారాష్ట్రలో కొత్త‌గా 983 పక్షులు మృతి

  • దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ కేసులు
  • లాతూర్‌లో 253 ప‌క్షులు మృతి
  • అప్ర‌మ‌త్త‌మైన అధికారులు
  • న‌‌మూనాల‌ను ల్యాబ్ కు త‌ర‌లింపు  
దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ కేసులు అల‌జ‌డి రేపుతోన్న విష‌యం తెలిసిందే. ప‌లు ప్రాంతాల్లో ప‌క్షులు భారీ సంఖ్య‌లో మృత్యువాత ప‌డుతున్నాయి. మహారాష్ట్రలో కొత్త‌గా 983 పక్షులు మృతి చెందాయి. ఆ రాష్ట్రంలోని లాతూర్‌లో 253, యవత్మాల్‌లో 205, అహ్మద్ నగర్ 151, వార్ధా 109, నాగ్పూర్ 45, గోందియాలో 23 ఫౌల్ట్రీ పక్షులు మృతి చెందాయి.

దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు వాటి న‌మూనాల‌ను డీఐఎస్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌కు పంపారు. ఈ నెల మొత్తం 5,151 పక్షులు మృతి చెందాయని అధికారులు తెలిపారు. ప‌లు ప్రాంతాల్లో ప‌క్షులకు ఏయిన్‌ఫ్లూ సోకిన‌ట్లు చెప్పారు. బీడ్ జిల్లాలో ప‌లు కాకుల‌కు హెచ్‌5ఎన్‌8 వైరస్ సోకిన‌ట్లు తేల్చారు.

ఈ నేప‌థ్యంలో బీడ్ ను వైరస్‌ జోన్‌గా ప్రకటించి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో బర్డ్ ‌ఫ్లూ కేసులు వెలుగులోకి వ‌స్తోన్న‌ నేపథ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం పలు సూచనలు చేసింది.  

ప్రజలకు ఫ్లూ గురించి తెలిసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని తెలిపింది. మాంసం, గుడ్ల‌ను పూర్తిగా ఉడికించి తినాల‌ని చెప్పింది. అలాగే, వదంతులు వ్యాప్తి కాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది.


More Telugu News