ఇవే మన అత్యాధునిక రైలు బోగీలు: ట్విట్టర్ లో నరేంద్ర మోదీ!
- నేడు ప్రారంభించనున్న మోదీ
- ప్రయాణికులకు నూతన అనుభూతి
- మరిన్ని రైళ్లకు త్వరలోనే విస్టాడోమ్ కోచ్ లు
అహ్మదాబాద్ నుంచి కెవాడియా మధ్య నడిచే జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుకు నేటి నుంచి అత్యాధునిక విస్టా డోమ్ కోచ్ లను జోడించనుండగా, ఆ చిత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ప్రజలకు చూపించారు. ఈ ఉదయం ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్ విధానంలో మోదీ ప్రారంభించనున్నారు. ఈ కోచ్ లు ప్రయాణికులకు నూతన అనుభూతిని మిగుల్చుతాయని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. త్వరలోనే మరిన్ని రైళ్లకు ఇవే తరహా కోచ్ లను రైల్వే శాఖ అనుసంధానించనుందని మోదీ తెలిపారు.
కాగా, ఈ కోచ్ లు బయటి ప్రపంచాన్ని మరింతగా చూపిస్తాయి. రూఫ్ కూడా అధిక శాతం పారదర్శకంగా అద్దాలతో ఉంటుంది. ఈ రైలు గుజరాత్ లోని నర్మదా నదిపై నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మీదుగా సాగుతుందని గుర్తు చేసిన మోదీ, ఈ రైల్లో ప్రజలు ఇకపై మరింత ఆనందంగా ప్రయాణిస్తూ, అత్యద్భుత సర్దార్ పటేల్ విగ్రహ సందర్శనకు వెళ్లవచ్చని అన్నారు.
ఈ సరికొత్త విస్టాడోమ్ కోచ్ లను అనుసంధానించిన రైళ్ల జాబితాను సైతం మోదీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కెవాడియా - వారణాసి మహామన ఎక్స్ ప్రెస్, దాదర్ - కెవాడియా మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్, కెవాడియా - హజ్రత్ నిజాముద్దీన్ మధ్య నడిచే బై వీక్లీ ఎక్స్ ప్రెస్, కెవాడియా - రేవా మధ్య తిరిగే వీక్లీ ఎక్స్ ప్రెస్, చెన్నై - కెవాడియా మధ్య నడిచే వీక్లీ ఎక్స్ ప్రెస్, ప్రతాప్ నగర్ - కెవాడియా మధ్య నడిచే మెమూ ట్రయిన్ లకు వీటిని అమర్చనున్నట్టు తెలిపారు.