ఏపీలో ఆలయాల దాడుల గురించి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తాం: ఉడుపి పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ
- ఏపీలో కొంతకాలంగా ఆలయాలపై దాడులు
- ఆందోళన వ్యక్తం చేసిన ఉడుపి పీఠాధిపతి
- కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
- సీఎం చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ
కర్ణాటకలోని ఉడుపి పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ ఏపీలో ఆలయాలపై దాడుల పట్ల స్పందించారు. ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు పెరిగిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని తాము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
ఆలయాలపై దాడుల అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయాల్లో దాడులు జరగకుండా సీఎం చర్యలు చేపట్టాలని అన్నారు. ఆలయాల రక్షణలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, రథాలు, విగ్రహాల ధ్వంసం ఘటనలు కొనసాగుతున్నాయని విశ్వప్రసన్న తీర్థ విమర్శించారు. ఆలయాలపై దాడులను హిందుత్వంపై జరుగుతున్న దాడులుగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.