'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?

  • రవితేజ హీరోగా సంక్రాంతికి వచ్చిన 'క్రాక్'
  • మంచి హిట్ అంటూ ట్రేడ్ రిపోర్టులు
  • హిందీలోకి రీమేక్ చేసే ప్రయత్నాలు 
  • రైట్స్ కోసం ప్రయత్నిస్తున్న సోనూసూద్  
సౌత్ లో ఏదైనా సినిమా హిట్టయితే చాలు.. బాలీవుడ్ నిర్మాతలు ఫ్యాన్సీ రేట్లు పెట్టి రీమేక్ హక్కులు కొనేస్తున్నారు. అందుకే, ఇక్కడ ఒక సినిమా రిలీజవుతోందంటే ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా విడుదలైన 'క్రాక్' సినిమా కూడా అప్పుడే హిందీలోకి రీమేక్ చేయనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన 'క్రాక్' సినిమా ఈ సంక్రాంతికి తెలుగు రాష్ట్రాలలో విడుదలైంది. పోలీస్ ఆఫీసర్ గా రవితేజ అభినయం ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ సినిమా మంచి హిట్ అయిందన్న ట్రేడ్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి అప్పుడే బాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోపక్క, 'క్రాక్' హిట్టవ్వడంతో ఈ చిత్రాన్ని తానే రీమేక్ చేయాలని బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన డైరెక్టుగా చిత్ర నిర్మాత మధుతో చర్చలు కూడా జరుపుతున్నట్టు చెబుతున్నారు. రీమేక్ హక్కుల రేటు విషయమై ఇద్దరి మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయట. ఈ సినిమాలో తానే హీరోగా నటిస్తూ.. తానే స్వయంగా నిర్మించాలని సోనూసూద్ యోచిస్తున్నాడట. మరి, ఇందులో ఎంతవరకు వాస్తవం వుందన్నది త్వరలో తెలుస్తుంది.  


More Telugu News