ముద్రగడ పద్మనాభంతో సోము వీర్రాజు భేటీ
- మర్యాదపూర్వకంగా కలిశానన్న సోము వీర్రాజు
- అనేక దఫాలుగా మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారని ట్వీట్
- రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలపై చర్చ
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను తాను కలవనున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిన్న తెలిపిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే ముద్రగడను ఆయన కలిసి చర్చించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
మాజీ మంత్రి వర్యులు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని మర్యాదపూర్వకంగా కలిశానని సోము వీర్రాజు తెలిపారు. అనేక దఫాలుగా మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించారని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముద్రగడ ఓ కీలక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ విషయంపైనే తాను చర్చించానని అన్నారు.
'కుటుంబ రాజకీయాల నుండి విముక్తి కల్పిస్తూ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ, బలీయమైన శక్తిగా భాజపా - జనసేన కూటమి పాత్ర పోషించనున్న నేపథ్యంలో మా మధ్య జరిగిన స్నేహపూర్వక భేటీ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. మా పట్ల శ్రీ ముద్రగడ పద్మనాభం గారు చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని అన్నారు.