ఏపీలో తొలి వ్యాక్సిన్ వేయించుకున్న‌ పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారి

  • వ్యాక్సినేష‌న్ ను ప్రారంభించిన జ‌గ‌న్
  • ఏపీలో మొత్తం 332 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్
  • ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల‌కు వ్యాక్సిన్లు  
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రారంభించారు.  ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ఏపీ మంత్రులు కూడా పాల్గొన్నారు. ఏపీలో తొలి వ్యాక్సిన్‌ను పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారికి  వేశారు. స్వచ్చందంగా ముందుకు వచ్చి ఆమె వాక్సిన్ వేయించుకున్నార‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఏపీలో మొత్తం 332 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల‌కు వ్యాక్సిన్లు వేస్తున్నారు.

ఏపీకి మొత్తం 4.96 లక్షల డోసుల వ్యాక్సిన్ రాగా, అందులో 20,000 డోసులు మాత్రం భార‌త్ బయోటెక్ అభివృద్ది చేసిన కొవాగ్జిన్ కి చెందిన‌వి కాగా, మిగిలినవన్నీ ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజ‌న్యంతో త‌యారైన కొవిషీల్డ్ కు చెందిన‌వి. ఇప్పుడు తొలి విడతలో కొవిషీల్డ్‌ను వేస్తున్నారు. ఏదైనా ఓ గుర్తింపుకార్డును చూపిస్తేనే ఆయా వ్యక్తులను పంపిణీ కేంద్రానికి అనుమతిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు అస్వ‌స్థ‌త‌కు గురైతే వెంట‌నే వారికి చికిత్స అందిస్తారు. కాగా, దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లోనూ క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.


More Telugu News