ఢిల్లీలో ఏఐసీసీ నేతలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు.. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం
- రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు
- అభ్యర్థుల జాబితా ఏఐసీసీకి అందజేత
- మూడు రోజుల్లో ఖరారు చేసే అవకాశం
తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో తెలంగాణలో జరిగిన అన్ని ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించడంలో చాలా ఆలస్యం చేసిందని విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి మాత్రం అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టింది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. ప్రధాన అభ్యర్థులతో ప్రాథమికంగా గుర్తించిన జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలకు ఇచ్చారు. ఈ జాబితాపై నేడు ఆయన వారితో చర్చించనున్నారు.
మూడు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిత్వాలపై ఏఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శులు జి.చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, ఎస్‌ఎ సంపత్‌కుమార్, హర్షవర్ధన్‌రెడ్డి రేసులో ఉన్నట్లు తెలిసింది.
అలాగే, వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఓయూ విద్యార్థి నాయకుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, కాంగ్రెస్‌లో ఆదివాసీ విభాగం జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌లు ప్రధానంగా పోటీ పడుతున్నారు.
వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానంలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ బరిలో నిలవనున్నారు. ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుపుతున్నాయి. పలు పార్టీలు ఇప్పటికే నామమాత్రంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.