ప్ర‌భుత్వ ఒత్తిడి వ‌ల్లే వాటిని తప్పుదోవ పట్టిస్తున్నారు: బోండా ఉమ‌

  • రాష్ట్రంలో ఆల‌యాల‌పై దాడులు
  • అసలైన నిందితుల జాబితా పోలీసుల దగ్గర ఉంది
  • వైసీపీ పాలనలో కొందరు ఐపీఎస్‌లు వైపీఎస్‌‌లుగా మారారు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత బోండా ఉమ విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ ఆదేశాలతోనే ఆల‌యాల‌పై దాడుల‌ కేసుల‌ను రాజకీయ కక్ష సాధింపు కేసులుగా మారుస్తున్నారని ఆయన ఆరోపించారు. దాడుల‌కు పాల్ప‌డిన అసలైన నిందితుల జాబితా పోలీసుల దగ్గర ఉన్నప్ప‌టికీ ప్ర‌భుత్వం ఒత్తిడి వ‌ల్లే ఈ కే‌సుల‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో కొందరు ఐపీఎస్‌లు వైపీఎస్‌‌లుగా మారారని ఆయ‌న ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై చాలా సార్లు కోర్టులు మొట్టికాయ‌లు వేసిన‌ప్ప‌టికీ రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల గురించి ఐపీఎస్ లు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని తెలిపారు. అంతేగాక‌, సామాజిక మాధ్య‌మాల్లో స‌ర్కారు వైఫల్యాలను గుర్తు చేస్తూ పోస్టులు చేస్తే మాత్రం అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. దేవాలయాల్లోనూ మతమార్పిడులు చేస్తుండటం స‌రికాద‌ని విమ‌ర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం వచ్చాక మతమార్పిడులు పెరిగాయని ఆరోపించారు.


More Telugu News