బీజేపీలో చేరబోతున్నారనే వార్తలపై కళా వెంకట్రావు స్పందన
- ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీయనున్న బీజేపీ
- బీజేపీలో చేరబోతున్నారంటూ తెరపైకి పలువురి పేర్లు
- చివరి వరకు చంద్రబాబుతోనే ఉంటానన్న కళా వెంకట్రావు
ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరలేపబోతోందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలను కూడా ఆకర్షించేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారని చెపుతున్నారు. రాజకీయాలలో క్రియాశీలకంగా లేని నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించనున్నారని అంటున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేరు కూడా వినిపిస్తుండటం గమనార్హం. మరోవైపు టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంపై ఆయన స్పందించారు.
తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కళా వెంకట్రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తన ఇంటికి వస్తున్నారనే వార్తల్లో కూడా వాస్తవం లేదని... అసలు ఆ విషయం తనకు తెలియదని చెప్పారు. తాను టీడీపీలోనే ఉంటానని... చివరి క్షణం వరకు చంద్రబాబుతోనే ఉంటానని అన్నారు. తనకు పార్టీ మారాల్సిన అవసరమే లేదని చెప్పారు. మరోవైపు, కళా వెంకట్రావు బీజేపీలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురయ్యాయి. ఈ విషయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.