భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 549 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 161 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకుల్లో ట్రేడ్ అవుతుండటం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనికి తోడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 549 పాయింట్లు కోల్పోయి 49,034కి పడిపోయింది. నిఫ్టీ 161 పాయింట్లు నష్టపోయిన 14,433కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్(3.84%), ఐటీసీ (1.77%), బజాజ్ ఆటో (0.16%), బజాజ్ ఫైనాన్స్ (0.03%)

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-4.35%), హెచ్సీఎల్ టాక్నాలజీస్ (-3.73%), ఓఎన్జీసీ (-3.48%), ఏసియన్ పెయింట్స్ (-2.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.39%).


More Telugu News