ఐఐటీ బాంబే నుంచి పుట్టిన సంస్థ.. ఆర్మీతో రూ.130 కోట్ల డీల్​!

  • అధునాతన డ్రోన్లు తయారు చేసేందుకు ఒప్పందం
  • అత్యంత ఎత్తుల్లోనూ పనిచేయగల సామర్థ్యం
  • కఠిన వాతావరణంలోనూ రాత్రింబవళ్లు నిఘా
ఆర్మీకి ఆయుధాలు తయారు చేసి ఇవ్వాలంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో అనుభవం ఉండి తీరాలి. ఆయుధాల్లో ప్రత్యేకతలు ఉండాలి. అలాంటిది ఐఐటీ బాంబే నుంచి పురుడు పోసుకున్న ఓ సంస్థ ఆర్మీతో రూ.130 కోట్ల ఒప్పందాన్ని చేసుకుంది. అధునాతన డ్రోన్లు అందించేందుకు డీల్ కుదుర్చుకుంది. 2007లో ఐఐటీ ఇంక్యుబేటర్ అయిన 'సైన్' ద్వారా అంకిత్ మెహతా, రాహుల్ సింగ్, ఆశిష్ భట్ అనే ముగ్గురు స్నేహితులు ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ అనే సంస్థను నెలకొల్పారు.

స్విచ్ యూఏవీ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్– డ్రోన్)లను ఆర్మీకి తయారు చేసి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని ఐడియా ఫోర్జ్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. తమ డ్రోన్లు మిగతా వాటి కంటే ప్రత్యేకమని వివరించింది. మిగతా డ్రోన్లతో పోలిస్తే అత్యంత ఎత్తుల్లో ఎక్కువ సమయం పాటు తమ డ్రోన్లు పనిచేస్తాయని తెలిపింది. అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ‘రాత్రింబవళ్లూ’ నిఘా వేయగలుగుతాయని పేర్కొంది. నిట్టనిలువుగా ఎగిరిపోవడం, దిగడం (వీటీవోఎల్) టెక్నాలజీతో తయారైన ఈ డ్రోన్లకు ఫిక్స్ డ్ రెక్కలుంటాయని చెప్పింది.


More Telugu News