బిట్ కాయిన్ వ్యవహారం ఓ ఆకర్షణీయమైన బుడగ వంటిది: రఘురామ్ రాజన్
- బిట్ కాయిన్ పై రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు
- గతేడాది ఆరంభంలో దాని విలువ 10 డాలర్లని వెల్లడి
- ఇప్పుడది 40 వేల డాలర్లు పలుకుతోందని వివరణ
- మరింత ధర పెరుగుతుందని ప్రజలు భావిస్తున్నారన్న రఘురామ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బిట్ కాయిన్ కరెన్సీ ప్రస్తుత పరిస్థితిపై స్పందించారు. బిట్ కాయిన్ విలువ గతేడాది ఆరంభంలో 10 వేల డాలర్లు ఉంటే ఇప్పుడది 40 వేలకు పెరిగిందని అన్నారు. ఇంకా పెరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని, ఇదొక ఆకర్షణీయమైన బుడగ వంటిదేనని అభివర్ణించారు. వాస్తవికంగా చూస్తే దీనికి విలువ లేదని స్పష్టం చేశారు.
బిట్ కాయిన్ అనేది ఒక ఆస్తి వంటిదని, దాంతో ఎలాంటి చెల్లింపులు చేయలేమని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు 40 వేల డాలర్ల ధర పలుకుతున్నా గానీ బిట్ కాయిన్ ను ప్రజలు కొంటున్నారంటే భవిష్యత్తులో దాని విలువ మరింత పెరుగుతుందని వారు భావిస్తుండడమేనని వివరించారు. ఇదొక బుడగ వంటి దృక్పథం అని ఆయన విశ్లేషించారు.