అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పొత్తుల‌పై స్పందించిన మాయావ‌తి!

  • మ‌రో రెండేళ్ల‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు
  • పోటీపై ప్ర‌ధాన పార్టీల ప్ర‌ణాళిక‌లు
  • ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమ‌న్న మాయావ‌తి
మ‌రో రెండేళ్ల‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీల‌న్నీ అప్పుడే ఎన్నిక‌ల కోసం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పొత్తులపై స‌మాలోచ‌న‌లు చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ త‌మ పార్టీ ఎన్నిక‌ల‌ ప్ర‌ణాళికపై స్పందించారు. యూపీలో త‌మ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోకుండానే పోటీ చేస్తుంద‌ని తెలిపారు. అలాగే, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము ఇదే విధానాన్ని అనుస‌రిస్తామ‌ని చెప్పారు.

మరోపక్క, క‌రోనా వ్యాక్సిన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను స్వాగతిస్తున్న‌ట్లు మాయావ‌తి ప్ర‌క‌టించారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందించాలని ఆమె అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ నూత‌న‌ వ్యవసాయ చట్టాలపై నిర‌స‌న‌లు తెలుపుతోన్న రైతుల‌కు త‌మ పార్టీ మ‌ద్ద‌తు తెలుపుతోంద‌ని తెలిపారు. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో నిర‌స‌న తెలుపుతోన్న రైతుల డిమాండ్లను కేంద్ర ప్ర‌భుత్వం నెర‌వేర్చాల‌ని ఆమె చెప్పారు.


More Telugu News