కనుమ సంద‌ర్భంగా ఆంధ్రా జ‌ల్లిక‌ట్టు.. వేడుక‌ను వీక్షించిన వైసీపీ నేత రోజా

  • చిత్తూరు జిల్లాలోని పుల్లయ్యగారిపల్లెలో వేడుక‌
  • నిర్వ‌హించిన‌ స్థానిక‌ రైతులు
  • కరోనా నేప‌థ్యంలో పోలీసుల ఆంక్షలు
సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ సంద‌ర్భంగా చిత్తూరు జిల్లాలోని పుల్లయ్యగారిపల్లెలో ఆంధ్రా పశువుల పండుగను నిర్వ‌హిస్తున్నారు. ఈ పండుగ‌ను జల్లికట్టుగానూ పిలుస్తారు. స్థానిక‌ రైతులు ఈ వేడుక‌లో పాల్గొంటారు.  ఈ సారి ఈ పండుగ కరోనా నేప‌థ్యంలో పోలీసుల ఆంక్షల మధ్య పుల్లయ్యగారిపల్లెలో జ‌రిగింది.

ఈ వేడు‌కలో పశువులకు కట్టిన చెక్క పలకల కోసం యువ‌కులు పోటీ ప‌డుతుంటారు.  పశువుల కొమ్ములు వంచుతూ ఈ ఆట ఆడుతుంటారు. ఈ వేడుక‌కు తమిళనాడు నుంచి కూడా యువకులు భారీగా తరలివచ్చారు. అలాగే, వైసీపీ ఎమ్మెల్యే రోజాతో పాటు ప‌లువురు ఈ కార్యక్ర‌మాన్ని ఓ భ‌వ‌నంపై నుంచి వీక్షించారు. ఈ వేడుక‌కు జ‌నాలు భారీగా త‌ర‌లి వ‌చ్చారు.


More Telugu News