సాగు చట్టాలతో వ్యవసాయ సంస్కరణలు: ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్
- దళారుల బెడద తప్పుతుందన్న గెర్రీ రైస్
- పంటకు మంచి ధర లభిస్తుందని ఆశాభావం
- చట్టాలను అమలు చేసే విధానమూ ముఖ్యమేనని వెల్లడి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు వ్యవసాయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడిన ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గెర్రీ రైస్.. ఢిల్లీలో రైతుల ఆందోళనపై మీడియా ప్రశ్నించగా చట్టాలు మంచివేనని స్పందించారు. కొత్త చట్టాలు మంచివే అయినా, ఈ కొత్త పద్ధతికి మారే క్రమంలో ప్రభావిత రంగాలు, వ్యక్తుల సామాజిక భద్రతను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
సాగు చట్టాల వల్ల రైతులు నేరుగా తమ పంటను అమ్ముకునేందుకు వీలవుతుందన్నారు. దళారుల బెడద తప్పి పంటకు మంచి ధర లభిస్తుందని చెప్పారు. అంతేగాకుండా గ్రామీణాభివృద్ధికి సాగు చట్టాలు దోహదపడుతాయని, వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాయని అన్నారు. అయితే, చట్టాలను అమలు చేసే విధానంపైనే వ్యవసాయ సంస్కరణలు ఆధారపడి ఉంటాయన్నారు. కాబట్టి సంస్కరణలతో పాటే వాటి వల్ల వచ్చే సమస్యలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.