ఇండోనేషియాలో భారీ భూకంపం.. ఏడుగురి మృతి, శిథిలాల కింద వందలాదిమంది!
- అర్ధరాత్రి దాాటాక ఒంటి గంట సమయంలో భూకంపం
- రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైన తీవ్రత
- మాజెన్ నగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం
ఇండోనేషియాలోని సులవేసి దీవిలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద వందలాదిమంది చిక్కుకుపోయినట్టు గుర్తించారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. అలాగే, ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మాజెన్ నగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం కారణంగా మముజులో ముగ్గురు చనిపోగా, 24 మంది గాయపడినట్టు, అలాగే మాజెన్ నగరంలో 637 మంది గాయపడినట్టు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బీఎన్‌పీబీ తెలిపింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో భూకంపం సంభవించినట్టు పేర్కొంది. 60 ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపింది. కాగా, భూకంప భయంతో జనం భయంతో పరుగులు తీశారు.