ఈ ఏడాది 'ముఖ్య అతిథి' లేకుండానే రిపబ్లిక్ డే వేడుకలు

  • భారత్ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచే రిపబ్లిక్ డే
  • ప్రతి ఏడాది ఓ విదేశీ ప్రముఖుడికి ఆహ్వానం
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
  • ఈ ఏడాది ఎవర్నీ పిలవరాదని నిర్ణయం
  • ప్రకటన చేసిన విదేశాంగ శాఖ
భారతదేశ శక్తి, సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచే రిపబ్లిక్ డే వేడుకలకు ఈసారి ముఖ్య అతిథి ఎవరూ లేరు. కరోనా రక్కసి విలయతాండవం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, ముఖ్య అతిథి లేకుండానే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

ప్రతి ఏడాది ఢిల్లీ ఎర్రకోటపై జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఓ విదేశీ నేతను చీఫ్ గెస్టుగా పిలవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి వేడుకలను ముఖ్య అతిథి లేకుండానే నిర్వహించదలచుకున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.

వాస్తవానికి ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఆహ్వానించారు. అయితే బ్రిటన్ లో కొత్తరకం కరోనా విజృంభిస్తుండడంతో ఆయన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. దాంతో ఈ ఏడాది ఇంకెవర్నీ పిలవరాదని భారత్ నిర్ణయించుకుంది.


More Telugu News