శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి... పులకించిన అయ్యప్ప భక్తులు

  • ఏటా శబరిమలలో మకరజ్యోతి దర్శనం
  • సాయంత్రం 6.49 గంటలకు ప్రత్యక్షమైన దివ్యజ్యోతి
  • ఈసారి మకరజ్యోతి దర్శనానికి 5 వేల మందికి అనుమతి
  • వర్చువల్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా వీక్షించిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో ఈ సాయంత్రం 6.49 గంటలకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. చీకట్లు కమ్ముకునే సమయంలో శబరిమల పొన్నాంబళమేడు కొండల్లో పవిత్ర జ్యోతి దర్శనమివ్వడంతో అయ్యప్పస్వామి భక్తకోటి పులకించింది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ దైవ నామస్మరణతో శబరిమల క్షేత్ర పరిసరాలు మార్మోగిపోయాయి.

కరోనా వ్యాప్తి కారణంగా ఈసారి మకరజ్యోతి దర్శనానికి 5 వేల మందికి మాత్రమే అయ్యప్ప దేవస్థానం అధికారులు అనుమతి ఇచ్చారు. వర్చువల్ విధానంలో దేశవ్యాప్తంగా మకరజ్యోతిని వీక్షించిన భక్తులు తరించిపోయారు. అంతకుముందు, పందాళం నుంచి తీసుకువచ్చిన ఆభరణాలను అర్చక స్వాములు అయ్యప్పకు అలంకరించారు.

కాగా, ఇక్కడి కాంతమాల కొండలపై ప్రతి సంక్రాంతికి దేవతలు, రుషులు కలిసి స్వామివారికి హారతి ఇస్తారని భక్తులు నమ్ముతారు.


More Telugu News