రామసేతు వయసెంత?... సముద్రగర్భంలో కీలక పరిశోధన చేపడుతున్న భారత్
- రామేశ్వరం నుంచి లంక వరకు వంతెన
- రామాయణ కాలం నాటిదని హిందువుల విశ్వాసం
- ప్రకృతిసిద్ధంగా ఏర్పడిందని బలమైన అభిప్రాయాలు
- సున్నపురాయి, ఇసుకతో రామసేతు
- అధ్యయనం చేపట్టనున్న సీఎస్ఐఆర్-ఎన్ఐఓ
భారత్, శ్రీలంకలను కలుపుతున్నట్టుగా ఉండే రామసేతు నిజంగా ఓ అద్భుతం. ఇది రామాయణకాలం నాటిదని హిందువులు నమ్ముతారు. తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంక మన్నార్ వరకు ఇది విస్తరించి ఉంటుంది.
ఈ వారధి మీదుగానే రాముడు తన సైన్యంతో లంకను ముట్టడించినట్టు రామాయణంలో పేర్కొన్నారు. మరెక్కడా లేని విధంగా ఇసుక, సున్నపురాళ్ల మిశ్రమంతో కూడిన రాళ్లు ఈ సేతువు ఆసాంతం కనిపిస్తాయి. దాదాపు 30 కిలోమీటర్ల పొడవుండే రామసేతు ఎప్పుడు ఏర్పడిందన్నదానిపై అనేక రకాల వాదనలున్నాయి.
ఇది ప్రకృతిసిద్ధంగా ఏర్పడిందన్న అభిప్రాయాలు కాస్త బలంగానే వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఆడమ్స్ బ్రిడ్జిగా ప్రాచుర్యంలో ఉన్న ఈ వారధి వయసెంతో తెలుసుకునేందుకు సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ) నిర్ణయించింది.
ఈ మేరకు వచ్చిన ప్రతిపాదనలకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కు చెందిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఆర్కియాలజీ ఆమోదం తెలిపింది. పురాతన వస్తువులు, రేడియో మెట్రిక్, పదార్థాల ఉష్ణోగ్రత, కాంతి పరిశీలన, పర్యావరణ సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం చేపడుతున్నట్టు ఎన్ఐఓకు చెందిన ప్రొఫెసర్ సునీల్ కుమార్ సింగ్ వెల్లడించారు.