రామతీర్థంలో విగ్రహ ధ్వంసం ఘటన స్థలాన్ని పరిశీలించిన చినజీయర్ స్వామి

  • ఇటీవల రామతీర్థంలో విగ్రహ ధ్వంసం
  • రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఘటన   
  • ఘటన వివరాలు చినజీయర్ కు తెలిపిన అధికారులు
  • చినజీయర్ పర్యటనను గోప్యంగా ఉంచిన వైనం
విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరామస్వామి ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంతటి కలకలం సృష్టించిందో తెలిసిందే. ఈ ఘటన తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం రేగడానికి కారణమైంది. కాగా, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి ఇవాళ రామతీర్థంలో పర్యటించారు.

ఇక్కడి కోదండరామస్వామి ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటనాస్థలిని పరిశీలించారు. రాముడి విగ్రహం తల లభించిన కోనేరు వద్దకు కూడా వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. అయితే, చినజీయర్ స్వామి రామతీర్థం వస్తున్న విషయం చివరి నిమిషం వరకు బయటికి పొక్కలేదు.

రామతీర్థం ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం ఈ కేసును తొలుత సీబీసీఐడీకి అప్పగిస్తున్నట్టు తెలిపింది. ఆపై ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ వేస్తున్నట్టు ప్రకటించింది. 


More Telugu News