మీల్‌వర్మ్స్ పురుగులను తినేందుకు జనానికి అనుమతి నిచ్చిన యూరప్
- ఇప్పటివరకు ఈ పురుగులు పక్షులు, తొండలకు ఆహారం
- ఇకపై మనుషులకు కూడా
- పురుగుల్లో ప్రోటీన్లు, విటమిన్ల వంటి పోషకాలు
ఆహార ప్రియుల కోరిక మేరకు మీల్‌వర్మ్స్ అనే బీటిల్ జాతి పురుగులను తినేందుకు యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ తాజాగా అధికారికంగా అనుమతులను ఇచ్చింది. దీంతో అక్కడి ప్రజలు చాలా ఇష్టంగా ఆ పురుగులను తింటున్నారు. ఇప్పటివరకు ఈ పురుగులను యూరప్ లో పక్షులు, తొండలు వంటి జంతువులకు ఆహారంగా వాడేవారు.
అయితే, మనుషులు కూడా తినొచ్చని అనుమతులు ఇవ్వడంతో వాటిని ఇష్టపడే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీల్‌వర్మ్స్ అనే బీటిల్ జాతి పురుగుల్లో ప్రోటీన్లు, విటమిన్లతో పాటు ఫ్యాట్, ఫైబర్స్ వంటి పోషకాలు లభిస్తాయి. వాటిని తింటే ఆరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు అనుమతులు ఇచ్చారు.