నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం!

  • నేడు మకర సంక్రాంతి
  • మధ్యాహ్నం తరువాత సన్నిధానానికి అయ్యప్ప ఆభరణాలు
  • తక్కువగా కనిపిస్తున్న రద్దీ
అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావించి దర్శించుకునే మకర జ్యోతి దర్శనం నేటి సాయంత్రం లభించనుంది. ఈ మధ్యాహ్నం తరువాత తిరు ఆభరణాలు స్వామి ఆలయాలకు చేరుకుంటాయని, ఆపై వాటిని స్వామికి అలంకరించి, తొలి హారతిని ఇచ్చే వేళ, మకర జ్యోతి దర్శనమిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.

మామూలుగా అయితే, సంక్రాంతి రోజున శబరిమలకు సుమారు 10 లక్షల మందికి పైగానే అయ్యప్ప భక్తులు చేరుకుని మకర జ్యోతిని దర్శించుకుంటారు. అయితే ఈ సంవత్సరం కరోనా కారణంగా నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండగా, భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ను తేవాల్సిందేనని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.


More Telugu News