అందుబాటు ధరలకే ఇళ్ల స్థలాలు.. భూసేకరణకు కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం

  • ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలను తీసుకురానున్న ప్రభుత్వం
  • టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
  • ఈనెల 21 లోగా నివేదిక అందించాలని ఆదేశం
ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్ల స్థలాలను విక్రయించేందుకు సంసిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన భూసేకరణకు గాను ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీకి టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్ నేతృత్వం వహిస్తుండగా... సభ్యులుగా డీటీసీపీ డైరెక్టర్ వి.రాముడు, ఏపీ హౌసింగ్ బోర్డు వీసీ బి.రాజగోపాల్, ఏఎంఆర్టీఏ జాయింట్ డైరెక్టర్ టి.చిరంజీవిలు వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

భూసేకరణకు సంబంధించి ఈనెల 21లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఏయే పట్టణ పరిధిలో ఎన్ని ఇళ్ల స్థలాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. భూసేకరణకు గాను నగర, పట్టణ ప్రాంతాలతో పాటు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న భూములను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది.


More Telugu News