చిత్తూరు జిల్లా జల్లికట్టు పోటీల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫొటో
- చిత్తూరు జిల్లా అనుప్పల్లిలో జల్లికట్టు పోటీలు
- చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా తరలి వచ్చిన జనాలు
- పోట్లగిత్త కొమ్ములకు తారక్ ఫొటో పెట్టి మురిసిపోయిన అభిమానులు
సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడుతో పాటు, ఆ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ఏపీలోని చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు పోటీలు జరుగుతాయి. వీటికి పెద్ద ఎత్తున జనాలు హాజరవుతారు. చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఓ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. ఓ పోట్లగిత్త కొమ్ములకు తారక్ ఫొటోలను పెట్టి ఆయన అభిమానులు మురిసిపోయారు.
జల్లికట్టులో పాల్గొనే పోట్లగిత్తలను అందంగా ముస్తాబు చేస్తారు. వీటి కొమ్ములకు వారికి నచ్చిన ఫొటోలను కూడా పెడుతుంటారు. రంగంలోకి దిగే పోట్లగిత్తల కొమ్ములు వంచడానికి కుర్రకారు ఆసక్తి చూపుతారు. ప్రమాదకరమైనప్పటికీ తెగించి బరిలోకి దిగుతారు. అనుప్పల్లిలో జరిగిన జల్లికట్టు పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణపల్లి, గంగిరెడ్డిపల్లి, యాపకుప్పం, చానంబట్ల, పాతచానంబట్ల, ఉప్పులవంక, నెమలిగుంటపల్లి, చవటగుంట తదితర గ్రామాల నుంచి తరలి వచ్చారు.