కోర్టులను పూర్తి స్థాయిలో తెరవడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కొనసాగుతున్న పలు విచారణలు
  • చాలా ఇబ్బందిగా ఉందంటూ లాయర్ల పిటిషన్
  • వైద్య నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న సుప్రీంకోర్టు
కరోనా నేపథ్యంలో కోర్టులు కూడా చాలా కాలం పాటు మూతపడిన సంగతి తెలిసిందే. అత్యవసర కేసులను మాత్రం వీడియో కాన్ఫరెన్సుల ద్వారా విచారిస్తున్నారు. దీంతో తమ వాదనలను వినిపించడంలో చాలా ఇబ్బంది పడుతున్నామని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టులను పూర్తి స్థాయిలో తెరవాలని పిటిషన్ లో కోరారు.

ఈ పిటిషన్ ను విచారించిన చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై వైద్య నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో కోర్టులను తెరిచినా కరోనా కారణంగా లాయర్లు కోర్టుకు హాజరు కావడంలేదని చెప్పింది. న్యాయవాదులకు వడ్డీలేని రుణాన్ని ప్రభుత్వం అందించేలా చూడాలని న్యాయవాదుల ప్రతినిధి కోరగా... రెండు వారాల తర్వాత ఈ అంశంపై విచారణ చేస్తామని తెలిపింది.


More Telugu News