ఏపీ గవర్నర్ తో ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ
- రాజ్ భవన్ లో చర్చ
- ఏపీ ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు
- ఎన్నికలకు సహకరించేలా ఆదేశాలు జారీ చేయాలని వినతి
ఏపీలో పంచాయతీ, స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల ఎన్నికల నిర్వహణ సందిగ్ధంగా మారింది.
పంచాయతీ ఎన్నికల నిమిత్తం షెడ్యూల్ ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 8న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో ఈ రోజు రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలిసి ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికలకు సహరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన గవర్నర్ ను కోరుతున్నట్లు తెలుస్తోంది.