జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- ఈ నెల 20న బైడెన్ ప్రమాణ స్వీకారం
- ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం
- క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ లో కార్యక్రమం
- ఇటీవల ట్రంప్ మద్దతుదారుల చర్యలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నెల 20న ఆయన క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే సమయంలో ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా విజృంభణ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అన్ని జాగ్రత్తల మధ్య నిర్వహించనున్నారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరు కాబోనని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాత్రం హాజరుకానున్నారు. అలాగే, మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, బిల్ క్లింటన్ వంటి ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
ఇటీవల ఇదే క్యాపిటల్ భవనంలోని వెస్ట్ ఫ్రంట్ లో అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు విధ్వంసానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఆ ఘటనతో క్యాపిటల్ భవనంలో పోలీసు బలగాలు భద్రతను విస్తృతంగా పర్యవేక్షిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఎస్‌ఈ, జాతీయ నిఘా సంస్థ సీక్రెట్ సర్వీస్ మాత్రమే కాకుండా పదుల సంఖ్యలో భద్రతా సంస్థలు భద్రతను పర్యవేక్షించనున్నాయి.
ఒకవేళ పది లక్షల మంది ఈ వేడుక జరిగే ప్రాంతానికి వచ్చినా వారిని అదుపులో ఉంచగల భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు 6200 మంది అదనపు భద్రతా సిబ్బంది కూడా ప్రత్యేకంగా పనిచేయనున్నారు. క్యాపిటల్ భవనం ఎక్కేందుకు సాధ్యం కాకుండా బ్లాక్ మెటల్‌తో చేసిన కంచెలను ఏర్పాటు చేశారు.
ప్రమాణ స్వీకారం రోజున రహదారుల మూసివేత వంటి చర్యలు తీసుకుంటారు. సాధారణంగా ప్రమాణ స్వీకారోత్సవానికి రెండు లక్షల మంది హాజరవుతారు. అయితే, ఈ సారి కరోనా నేపథ్యంలో సంఖ్యను తగ్గించారు. ఈ కార్యక్రమానికి రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు ఏమీ క్లోబుచర్, రాయ్ బ్లంట్ సమన్వయకర్తలుగా ఉన్నారు.