దేశంలో పది రాష్ట్రాలకు పాకిన బర్డ్ ఫ్లూ
- నిన్నటికి 7 రాష్ట్రాల్లో ఫ్లూ
- ఇవాళ మరో 3 రాష్ట్రాల్లో వెలుగుచూసిన వైనం
- ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లోనూ ఫ్లూ
- రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
భారత్ లో బర్డ్ ఫ్లూ కలకలం మరింత పెరిగింది. ఈ ప్రమాదకర ఫ్లూ మహమ్మారి 10 రాష్ట్రాలకు పాకినట్టు కేంద్రం వెల్లడించింది. నిన్నటికి 7 రాష్ట్రాలకు వ్యాప్తి చెందిన ఈ ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా ఇవాళ మరో మూడు రాష్ట్రాలకు పాకింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తోడు తాజాగా ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లోనూ ఫ్లూ వెలుగు చూసింది.
రాష్ట్రాలు బర్డ్ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టాలని కేంద్రం సూచించింది. జలాశయాలు, పౌల్ట్రీ పరిశ్రమలు, జంతుప్రదర్శన శాలల వద్ద నిఘా ఉంచాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది. ఇన్ఫెక్షన్ బారినపడిన కోళ్లు, ఇతర పక్షుల సామూహిక వధకు అవసరమైన పీపీఈ కిట్లు, ఇతర ఉపకరణాలు సమకూర్చుకోవాలని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.