పోలీసుల కస్టడీకి అఖిలప్రియ.. చంచల్ గూడ జైలు నుంచి తరలింపు!

  • అఖిలప్రియను 7 రోజుల కస్టడీకి కోరిన పోలీసులు
  • మూడు రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు
  • బేగంపేట పోలీస్ స్టేషన్ కు అఖిలప్రియ తరలింపు
మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియను తెలంగాణ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాదులోని చంచల్ గూడ జైలు నుంచి బేగంపేట పోలీస్ స్టేషన్ కు ఆమెను పోలీసులు తరలించారు. మూడు రోజుల పాటు ఆమెను విచారించనున్నారు.

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1గా ఉన్నారు. ప్రస్తుతం ఆమె రిమాండ్ లో ఉన్నారు. ఆమె వేసిన బెయిల్ పిటిషన్ ను ఈరోజు కోర్టు కొట్టివేసింది. మరోవైపు కిడ్నాప్ కేసులో విచారణ నిమిత్తం ఆమెను 7 రోజుల రిమాండ్ కు ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం మూడు రోజు కస్టడీకి అనుమతించింది.

మరోవైపు గర్భవతినైన తనకు మెరుగైన వైద్యం కోసం తరలించాలన్న అఖిలప్రియ విన్నపాన్ని కూడా కోర్టు తిరస్కరించింది. జైల్లో కూడా వైద్యులు, మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయని కోర్టు తెలిపింది.


More Telugu News