భారత మార్కెట్ పై కన్నేసిన అమెరికా విద్యుత్ కార్ల సంస్థ
- భారత్ లో అమ్మకాలకు సిద్ధమైన ట్రైటాన్
- ఎన్4 సెడాన్ తో రంగప్రవేశం
- ప్రారంభ ధర రూ.35 లక్షలు
- ఒక్కసారి బ్యాటరీ చార్జ్ చేస్తే 696 కిమీ ప్రయాణం
అమెరికాకు చెందిన విద్యుత్ ఆధారిత వాహనాల తయారీదారు ట్రైటాన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. తన పోర్ట్ ఫోలియోలో బాగా ప్రజాదరణ పొందిన ఎన్4 సెడాన్ ను భారత రోడ్లపై పరుగులు తీయించేందుకు సిద్ధమైంది. ఎన్4 సెడాన్ నాలుగు వేరియంట్లలో లభ్యమవుతుంది. అయితే ఈ నాలుగు వేరియంట్లతో పాటు హై పెర్ఫార్మెన్స్ లిమిటెడ్ ఎడిషన్ ఎన్4-జీటీ మోడల్ ను కూడా భారత్ కు పరిచయం చేయనుంది. అయితే లిమిటెడ్ ఎడిషన్ లో 100 కార్లను మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. ట్రైటాన్ రూపొందించిన ఎన్4 సెడాన్ ధర రూ.35 లక్షల నుంచి ప్రారంభం కానుంది.
కాగా, ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 75 కేడబ్ల్యూహెచ్, 100 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలతో వస్తోంది. 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఒక్కసారి చార్జ్ చేస్తే 523 కిలోమీటర్లు, 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 696 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ అధికారిక వెబ్ సైట్లో ప్రీలాంచ్ బుకింగ్స్ జరుపుతున్నట్టు వెల్లడించాయి. అటు, విద్యుత్ కార్ల దిగ్గజం టెస్లా కూడా భారత్ లో కార్యకలాపాలకు ప్రణాళికలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.