భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 487 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 138 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 6 శాతానికి పైగా లాభపడ్డ హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 11వ సెషన్లో కూడా లాభాలను గడించాయి. ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ స్టాకుల అండతో ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. మరోవైపు బ్యాంకింగ్, ఇన్ఫ్రా, పీఎస్యూ తదితర సూచీలు నష్టాలను చవిచూశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 487 పాయింట్లు లాభపడి 49,269కి ఎగబాకింది. నిఫ్టీ 138 పాయింట్లు పుంజుకుని 14,485కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (6.09%), ఇన్ఫోసిస్ (4.90%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (3.54%), మారుతి సుజుకి (2.66%), టెక్ మహీంద్రా (2.51%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-1.92%), బజాజ్ ఫైనాన్స్ (-1.90%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.86%), ఎల్ అండ్ టీ (-1.71%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.64%).