శబరిమలలో తెలంగాణవాసి మృతి
- మృతుడిది నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామం
- అయ్యప్ప దర్శనానికి వెళ్తుండగా ఛాతీలో నొప్పి
- ఆసుపత్రికి తరలించేలోగానే ప్రాణాలు వదిలిన వైనం
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు గుండెపోటుతో చనిపోయిన ఘటన నిన్న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన నరేశ్ (27) అనే యువకుడు హైదరాబాదులో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. గత ఐదేళ్లుగా ఆయన అయ్యప్ప మాల వేసుకుంటున్నాడు. గత గురువారం దామరగిద్దకు వచ్చి మరో అయ్యప్ప భక్తుడితో కలిసిన శబరిమలకు బయలుదేరాడు.
నిన్న తెల్లవారుజామున అయ్యప్ప దర్శనానికి వెళ్తుండగా... తన స్నేహితుడి నుంచి విడిపోయాడు. ఆ తర్వాత ఛాతీ నొప్పి రావడంతో పక్కనే ఉన్న స్వాములకు చెప్పాడు. హుటాహుటిన ఆయనను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన ప్రాణాలు వదిలినట్టు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత నరేశ్ తో పాటు వెళ్లిన మరో స్వామికి ఆ విషయం తెలిసింది.
ఆయన ఆ విషయాన్ని ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు తెలిపాడు. నరేశ్ మృతి వార్తతో గ్రామంలో విషాదం నెలకొంది. మరోవైపు, స్థానిక ఉన్నతాధికారులు, అక్కడున్న స్వాముల చొరవతో మృతదేహాన్ని స్వగ్రామానికి తెస్తున్నట్టు ఎంపీపీ నర్సప్ప తెలిపారు.