సోనూ సూద్ పిటిషన్ పై రేపు విచారణ చేపట్టనున్న బాంబే హైకోర్టు

  • సోనూ సూద్ కు బీఎంసీ నోటీసులు
  • అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు
  • బాంబే హైకోర్టును ఆశ్రయించిన సోనూ సూద్
  • నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడి
ముంబయిలోని తన భవనంలో అధికారిక అనుమతుల్లేకుండా మార్పులు చేశారంటూ బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) సోనూ సూద్ కు నోటీసులు పంపడం తెలిసిందే. దీనిపై సోనూ సూద్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబయిలోని 6 అంతస్తుల శక్తిసాగర్ భవంతిలో తాను ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టలేదని తన పిటిషన్ లో స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా కార్పొరేషన్ అనుమతులు తీసుకుని చేయాల్సిన ఎలాంటి మార్పులను సోనూ సూద్ చేయలేదని అతడి తరఫు న్యాయవాది డీపీ సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రీజినల్ అండ్ టౌన్ ప్లానింగ్ చట్టం అనుమతించిన మేరకే మార్పులు చేశారని వివరించారు. బీఎంసీ పంపిన నోటీసులను కొట్టివేయాలని కోరారు. బాంబే హైకోర్టులోని జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ ధర్మాసనం ఈ పిటిషన్ పై రేపు విచారణ చేపట్టనుంది.


More Telugu News