రాజకీయంగా ఎన్ని సంక్షోభాలు సృష్టించినా అమ్మఒడి కార్యక్రమం అమలు చేసి తీరుతాం: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్

  • ఏపీలో రేపు అమ్మఒడి
  • రెండో విడత కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం జగన్
  • 44 లక్షల 891 మందికి లబ్ది
  • వివరాలు తెలిపిన మంత్రి ఆదిమూలపు
ఏపీ ప్రభుత్వం రేపు అమ్మఒడి పథకంలో భాగంగా నిధులు విడుదల చేయనుంది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. రాజకీయంగా ఎన్ని సంక్షోభాలు సృష్టించినా అమ్మఒడి కార్యక్రమం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రేపు (జనవరి 11) ఉదయం 11 గంటలకు సీఎం జగన్ రెండో విడత అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ పథకం ద్వారా 44 లక్షల 891 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నట్టు వివరించారు.

అటు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపక్షం అడుగడుగునా అడ్డుపడుతోందని ఆరోపించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల విషయంలోనూ ఇలాగే కుట్రలు చేశారని, ఇప్పుడు అమ్మఒడి పథకాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా ప్రజల్లో తమ విలువను దిగజార్చుకుంటున్నారని విమర్శించారు.


More Telugu News