కదులుతోన్న రైలు కింద పడబోయిన మహిళను కాపాడిన పోలీసులు.. వీడియో ఇదిగో
- థానే రైల్వేస్టేషన్‌లో ఘటన
- ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోబోయిన మహిళ
- వెంటనే ఆమెను బయటకు లాగిన పోలీసులు
రైలు కింద పడబోయిన ఓ మహిళను పోలీసులు కాపాడారు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే రైల్వేస్టేషన్‌లోని ఐదో నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద చోటు చేసుకుంది. ఓ మహిళ రైల్వే స్టేషనులో కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నించి, ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్య పడిపోబోయింది. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు వెంటనే ఆమెను బయటకు లాగారు.
దీంతో స్వల్ప గాయాలతో ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆ మహిళ ప్రాణాలను కాపాడిన ఎస్‌ఐ నితిన్ పాటిల్, ఏఎస్‌ఐ సత్తార్ షేఖ్ ను అధికారులు అభినందించారు. ఈ ప్రమాద దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. రద్దీగా ఉన్న ఫ్లాట్ ఫామ్ పై ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడి ప్రయాణికులంతా ఆందోళన చెందారు.