మరోసారి కలకలం.. సిరాజ్ పై మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు.. మ్యాచ్ కి కాసేపు అంతరాయం
- అంపైర్లకు కెప్టెన్ రహానె, సిరాజ్ ఫిర్యాదు
- ఆరుగురు ప్రేక్షకులను బయటకు పంపిన పోలీసులు
- టీమిండియాకు ఆస్ట్రేలియా టీమ్ క్షమాపణలు
- నిన్న కూడా సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై జాత్యహంకార వ్యాఖ్యలు
సిడ్నీలో ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడుతోన్న సమయంలో క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై ప్రేక్షకుల్లో కొందరు నిన్న జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా మేనేజ్ మెంట్ ఇప్పటికే ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయం మరవక ముందే మరోసారి ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. భారత ఆటగాడు సిరాజ్ పై స్టాండ్స్ లో ఉన్న ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.
దీంతో అంపైర్లకు కెప్టెన్ రహానెతో పాటు సిరాజ్ ఫిర్యాదు చేశాడు. దీంతో మ్యాచ్ కు కాసేపు అంతరాయం కలిగింది. జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని పోలీసులు బయటకు పంపారు. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాత్యహంకార వ్యాఖ్యలపై టీమిండియాకు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు చెప్పింది.