సంక్రాంతికి నాలుగు రోజుల ముందే... విజయవాడ హైవేపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్!
- దాదాపు 2 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్
- నిన్న రాత్రి నుంచి విజయవాడవైపు వేల వాహనాలు
- టోల్ గేట్లను దాటేందుకు 45 నిమిషాల సమయం
సంక్రాంతి పర్వదినానికి ఇంకా నాలుగు రోజులు ఉండగానే హైదరాబాద్ నుంచి, విజయవాడకు దారితీసే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిన్న రాత్రి నుంచి వేలాది మంది కార్లలో హైవేపై ప్రయాణం ప్రారంభించడంతో ఈ ఉదయం టోల్ ప్లాజాలను దాటేందుకు ఒక్కో వాహనానికీ 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతోంది. దాదాపు 2 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో విజయవాడ వైపు మరిన్ని గేట్లను టోల్ ప్లాజా సిబ్బంది తెరిచారు.
అయితే, అత్యధిక వాహనాలు ఇప్పటికే ఫాస్టాగ్ ను కలిగివుండటంతో గతంతో పోలిస్తే, వాహనాల కదలికలు కాస్తంత వేగంగానే ఉన్నాయని సమాచారం. ఇదే సమయంలో కర్నూలు వైపు వెళ్లే జాతీయ రహదారిపైనా దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది.