భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తీసుకుని వాలంటీర్ మృతి... వివరణ ఇచ్చిన సంస్థ!

  • అతనిపై విషప్రయోగం జరిగి వుండవచ్చు
  • మరణానికి కారణం విచారణ తరువాత తెలుస్తుంది
  • వారం రోజులు ఆరోగ్యం బాగానే ఉందన్న భారత్ బయోటెక్
భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్ టీకాను తీసుకున్న మధ్యప్రదేశ్ వాలంటీర్, 10 రోజుల తరువాత మరణించిన ఘటన వ్యాక్సిన్ పనితీరుపై అనుమానాలు రేకెత్తించగా, సంస్థ స్పందించింది. భోపాల్ కు చెందిన 42 సంవత్సరాల వాలంటీర్, కన్నుమూయగా, క్లినికల్ ట్రయల్స్ తరువాత, వారం రోజుల పాటు అతని ఆరోగ్యం బాగానే ఉందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

అతను ఓ ప్రభుత్వ ఉద్యోగని, ఓ ప్రైవేటు హాస్పిటల్ లో వ్యాక్సిన్ ను వేశామని తెలిపిన భారత్ బయోటెక్, ఫాలో అప్ కాల్స్ లో అతను ఆరోగ్యంగానే ఉన్నాడని పేర్కొంది. మూడవ దశ ట్రయల్స్ లో పాల్గొనేందుకు తనకేమీ అభ్యంతరం లేదని చెబుతూ, అన్ని నియమ నిబంధనలనూ అతను అంగీకరిస్తూ సంతకాలు చేశారని తెలిపింది. అతనిపై విషప్రయోగం జరిగి వుండవచ్చని, మరణానికి అసలైన కారణం విచారణ తరువాత తెలుస్తుందని వెల్లడించింది.



More Telugu News