కరోనా టీకా తీసుకున్న క్వీన్ ఎలిజబెత్ దంపతులు
- బ్రిటన్‌లో చురుగ్గా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం
- అధికారిక నివాసంలో వ్యాక్సిన్ తీసుకున్న రాజ దంపతులు
- కరోనా కారణంగా నివాసానికే పరిమితమైన ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్
బ్రిటన్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. తొలి విడతలో వృద్ధులు, వారి సంరక్షకులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇస్తున్నారు. తాజాగా, నిన్న క్వీన్ ఎలిజబెత్ 2 (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99)లకు వ్యాక్సిన్ ఇచ్చారు. వారి నివాసం విండ్‌ఫోర్ క్యాస్టెల్‌లో ఆస్థాన వైద్యుడు టీకా ఇంజెక్షన్ ఇచ్చినట్టు బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.
‘‘క్వీన్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ నేడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు’’ అని క్లుప్తంగా పేర్కొన్నాయి. ఇంతకుమించిన వివరాలను వెల్లడించలేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వయసు రీత్యా ఎలిజబెత్ దంపతులు చాలా కాలం పాటు అధికారిక నివాసానికే పరిమితమయ్యారు. ఈ ఏడాది నిర్వహించాల్సిన క్రిస్మస్ వేడుకలను కూడా రద్దు చేసుకున్నారు.