తనను ఆసుపత్రికి తరలించాలన్న అఖిలప్రియ... ఉస్మానియాకు తీసుకెళ్లిన పోలీసులు

  • కిడ్నాప్ కేసులో అరెస్టయిన అఖిలప్రియ
  • 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  • ఉస్మానియాలో అఖిలప్రియకు సీటీ స్కానింగ్
  • తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇటీవల ఓ కిడ్నాప్ వ్యవహారంలో అరెస్టయిన సంగతి తెలిసిందే. కూకట్ పల్లిలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించారు. చంచల్ గూడ జైల్లో ఉన్న అఖిలప్రియ తనకు అస్వస్థతగా ఉందని, ఆసుపత్రికి తీసుకెళ్లాలని జైలు అధికారులను కోరారు. దాంతో, ఆమెను పోలీసులు ఇవాళ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో అఖిలప్రియకు సీటీ స్కానింగ్ తో పాటు పలురకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను పోలీసులు తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1 నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.


More Telugu News