అమెరికా అధ్యక్షుడి ఖాతానే మూసేసిన వాళ్లు..ఇక ఎవరి ఖాతానైనా మూసేస్తారు: ట్విట్టర్ పై తేజస్వి సూర్య వ్యాఖ్యలు

  • ట్రంప్ ఖాతాను శాశ్వతంగా మూసేసిన ట్విట్టర్
  • ఇది మేలుకొలుపు అని పేర్కొన్న తేజస్వి సూర్య
  • లేకపోతే భారత్ లోనూ ఇలాగే చేస్తారని హెచ్చరిక
  • ప్రజాస్వామ్యానికే చేటు అని స్పష్టీకరణ
తమ నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తే తమకు ఎవరైనా ఒకటేనంటూ ట్విట్టర్ అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా మూసేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ యువనేత, బెంగళూరు (సౌత్) ఎంపీ తేజస్వి సూర్య స్పందించారు. ఇవాళ అమెరికా అధ్యక్షుడి ఖాతానే మూసేసిందంటే రేపు ఎవరి ఖాతానైనా మూసేస్తుందని ట్విట్టర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇది ఒక మేలుకొలుపు వంటి పరిణామం అని, ప్రజాసామ్య వ్యవస్థలు కళ్లు తెరిచి ఇలాంటి అనియంత్రిత టెక్ కంపెనీలకు కళ్లెం వేయాల్సిన తరుణం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి టెక్ సంస్థల నియంత్రణ కోసం అమల్లో ఉన్న చట్టాలను సమీక్షించాలని, భారత్ లోనూ ఇలాంటి చర్యలకు పాల్పడకముందే జాగ్రత్త పడాలని సూచించారు. భారత్ తగు నిర్ణయం తీసుకుంటే అది మన ప్రజాస్వామ్యానికే మేలు అని తేజస్వి సూర్య పేర్కొన్నారు.


More Telugu News