సిరాజ్, బుమ్రాలపై సిడ్నీలో జాతి వివక్ష వ్యాఖ్యలు... ఫిర్యాదు చేసిన టీమిండియా
- సిడ్నీలో మూడో టెస్టు ఆడుతున్న భారత్, ఆసీస్
- భారత ఆటగాళ్లపై నోరు పారేసుకున్న ప్రేక్షకులు
- మేనేజ్ మెంట్ కు సమాచారం అందించిన బుమ్రా, సిరాజ్
- ఐసీసీ దృష్టికి తీసుకెళ్లిన టీమిండియా మేనేజ్ మెంట్
సిడ్నీలో టీమిండియా క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టు సందర్భంగా వారు జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్న సంగతి వెల్లడైంది. ప్రేక్షకుల్లోంచి కొందరు సిరాజ్, బుమ్రాలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బుమ్రా, సిరాజ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని టీమిండియా క్రికెటర్లు వెంటనే మేనేజ్ మెంట్ కు తెలియజేశారు. దీనిపై టీమిండియా మేనేజ్ మెంట్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ... టీమిండియా ఫిర్యాదును స్వీకరించి విచారణకు ఉపక్రమించింది. సిడ్నీ క్రికెట్ మైదానం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న 'వెన్యూస్ న్యూసౌత్ వేల్స్' తో కలిసి సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తోంది. ఆస్ట్రేలియాలో పర్యటించే క్రికెట్ జట్లకు ఇలాంటి అనుభవాలు కొత్త కాదు. గతంలోనూ అనేక వివాదాలు వర్ణ వివక్ష వ్యాఖ్యల ఫలితంగానే జరిగాయి.