తనపని తాను చేసుకుపోతున్న ఎన్నికల సంఘం... ఎన్నికల కోడ్ పై సీఎస్ కు లేఖ

  • గతరాత్రి స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • ఎన్నికల కోడ్ పై స్పష్టత నిచ్చిన ఎన్నికల సంఘం
  • కోడ్ గ్రామీణ ప్రాంతాలకే వర్తిస్తుందని వివరణ
  • పట్టణ, నగరాల్లో కోడ్ వర్తించదని వెల్లడి
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా, ప్రభుత్వ వర్గాలు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్నికల సంఘం మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ముందుకు పోతోంది. తాజాగా, ఏపీలో ఎన్నికల కోడ్ కు సంబంధించి సీఎస్ కు లేఖ రాసింది.

ఎన్నికలు పంచాయతీలకు సంబంధించినవి కావడంతో ఎన్నికల కోడ్ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని ఎన్నికల సంఘం ఆ లేఖలో స్పష్టత నిచ్చింది. పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రవర్తన నియమావళి అమలులో ఉండదని తెలిపింది. అయితే, గ్రామీణ ప్రజలకు లబ్ది చేకూర్చేందుకు పట్టణ ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేయడం నియమావళికి విరుద్ధమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


More Telugu News